పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

-తెలుగుదేశం నిర్వాకం
– రెవెన్యూ ఉద్యోగులకు పట్టాలు

Date:20/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేసింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు లేకపోవడం , కేటాయించిన స్థలాల్లో గత ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు, నాయకులకు , బడా వ్యాపారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాల నమోదు రిజిస్టర్‌లలో లేకపోవడంతో మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఖాళీ స్థలాలు మిగిలి ఉన్నాయని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పొందిన లబ్ధిదారులను గత ప్రభుత్వంలో పట్టాలు పొందిన బినామి లబ్ధిదారులు అడ్డుకోవడంతో బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, సిబ్బంది పరిశీలన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలోని నక్కబండలో 246 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఆ స్థలాల్లో రెవెన్యూ అధికారులు తమ కుటుంబీకుల పేరుతో, నాయకులు, వ్యాపారులు పట్టాలు తీసుకోవడం , ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మించి, ఇతరులకు అద్దెకు ఇవ్వడం వెలుగు చూసింది. అలాగే ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు తమకున్న అధికార ముసుగులో పలు అక్రమాలకు పాల్పడి, అనేక పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. ఈ స్థలాలను నూతన లబ్ధిదారులకు కేటాయించడంతో ఎలాగైన లక్షలాది రూపాయలు విలువ చేసే స్థలాలను చేజిక్కించుకోవాలని, ఆస్థలాల్లో రాత్రి రాత్రే పునాదులు వేయడంతో లబ్ధిదారులు విస్తు పోయారు. ఈ స్థలాల్లో తమకు పట్టాలు ఉన్నాయని బినామిలు అడ్డురావడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురై కమిషనర్‌ను ఆశ్రయించారు. కమిషనర్‌ ఈమేరకు పరిశీలన చేపట్టారు. ఈ విషయమై కమిషనర్‌ కెఎల్‌.వర్మను వివరణ కోరగా కొంత మంది రెవెన్యూ ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం పంపిణీ చేసిన జాబితాలోని లబ్ధిదారులు అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు. గతంలో పట్టాలు పొందిన విషయాన్ని రెవెన్యూ అధికారులు వెల్లడించకపోవడంతో సమస్య ఎదురైందన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా తహశీల్ధార్‌కు తెలిపామన్నారు. లబ్ధిదారులందరికి ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని కమిషనర్‌ తెలిపారు. కాగా ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, సబ్‌ కలెక్టర్‌ జహ్నావి వెంటనే విచారణ జరిపి, గత ప్రభుత్వంలో బినామి పట్టాలు పొందిన రెవెన్యూ ఉద్యోగులు, వ్యాపారులు, నాయకుల పట్టాలను రద్దు చేసి, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తహశీల్ధార్‌ వివరణ…

నక్కబండలో స్థలాలను పకడ్భంధిగా విచారించి, లబ్ధిదారులకు ఇస్తామని తహశీల్ధార్‌ వెంకట్రాయులు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు, అనర్హులు ఎవరైనా పట్టాలు పొంది ఉంటే వాటిని రద్దు చేసి, నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: Rails for Revenue Employees in Punganur Jagannath Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *