పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

ఈ నెల 25 న ములుగు జిల్లా కేంద్రంలో పోడు రైతుల తో కలిసి దీక్ష
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు ముచ్చట్లు:

ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెలకుమారస్వామి అధ్యక్షతన ఈ రోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరైనారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయం తో పని చేయాలని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పల  కపడుకుంటా నని సీతక్క గారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలు ఇస్తా కూర్చిసి కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరి స్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కనీసం స్పందించక పోవడం దారుణం అని ఒక పక్క ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల పై దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అని సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.పోడు రైతుల పక్షాన ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో దీక్ష కార్యక్రమం చేస్తున్నట్లు కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోడు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలి అని సీతక్క గారు పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా 7 తీర్మానాలు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు ప్రవేశపెట్టారు.1, వెనుకబడిన  ములుగు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని,2,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,3,గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారం భించాలి నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని,4,రైతులకు సబ్సిడీ క్రింద విత్తనాలు ట్రాక్టర్లు ఇవ్వాలని,5,ఏటూరు నాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని,6, మల్లం పెల్లి నీ మండలం గా ప్రకటించాలని,7,ములుగు జిల్లా కేంద్రములో పరిశ్రమ ను ఏర్పాటు చేయాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనిఅని తీర్మానాలు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,కిసాన్ సెల్,మైనార్టీ సెల్ఎస్టీ సెల్,ఎస్సీ సెల్,యూత్ కాంగ్రెస్   జిల్లా అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు,మండల అధ్యక్షులు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు జెడ్పీటీసీ లు ఎంపీపీ లు సహకార సంఘాల చైర్మన్లు,సర్పంచులు,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు సహకార సంఘాల డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Rails should be given to fallow lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *