పుంగనూరు ప్రజలకు రైల్వే సౌకర్యం కల్పించాలి- సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు

పుంగనూరు ముచ్చట్లు:

శుక్రవారం మధ్యాహ్నం భగత్ సింగ్ కాలనీ అయ్యల రాజు స్తూపం వద్ద జరిగిన పట్టణ సిపిఐ 14వ మహాసభ ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు డీజలు పెట్రోలు నిత్యవసర సరుకులు పేదవారు కొనే పరిస్థితిలో లేరని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు మాట్లాడుతూ ఈనెల 21, 22, తేదీల్లో జరిగే జిల్లా మహాసభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా రైతు సంఘం చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీ .జనార్దన్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాడుతుందని పుంగనూరు పట్టణంలో దీర్ఘ కాలిక సమస్యల కోసం పోరాడిన చరిత్ర సిపిఐ కి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కో కన్వీనర్ మున్నా, జిల్లా సహాయ కార్యదర్శి సూరి,పలమనేరు నియోజకవర్గ కార్యదర్శి ప్రేమ్చంద్, AISF నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

సిపిఐ పట్టణ కార్యదర్శిగా రామ్మూర్తి……

 

భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పుంగనూరు పట్టణ కార్యదర్శిగా కె. రామమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం జరిగిన పట్టణ 14 వ మహాసభ తీర్మానించింది ఈ సందర్భంగా పట్టణ. Cpi కార్యవర్గ సభ్యులుగాp. వెంకటరమణారెడ్డి, ఎస్ మున్నా. ( AiTUC ) నాయకుడు శ్రీరాములు వి మోహన్ (భగసింగ్ కాలనీ) రసూల్ శ్రీనివాసులు రత్నమ్మ. నాగయ్య కృష్ణమూర్తి, జీ. వి .చలపతి, శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, నూతనమ్మగా ఎన్నికైన పట్టణ కార్యవర్గాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి నాగరాజ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీ జనార్దన్ లు అభినందించారు.

Tags: Railway facility should be provided to the people of Punganur – CPI state executive member Ramanaidu

Leave A Reply

Your email address will not be published.