ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకొనే వారికి రైల్వే గుడ్ న్యూస్ 

Date:17/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఐఆర్‌సీటీసీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది ప్రత్యేకం. ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ గరిష్ఠంగా 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ పరిధిని నెలకు 12 టికెట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదికూడా ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి. మారిన నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్రారంభం కాగానే, 10 గంటలలోపు ఒక యూజర్ 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
 ఉ. 8.00 గం. నుంచి మ. 12 గం. మధ్య ‘సింగిల్ పేజ్’ లేదా ‘క్విక్ బుక్’ సర్వీస్‌ను ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది.ఐఆర్‌సీటీసీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఇక నుంచి సెక్యూరిటీ క్వశ్చన్‌ను ఎంచుకుని, దానికి జవాబు కూడా చెప్పాల్సి ఉంటుంది. ట్రావెల్ ఏజంట్ల సమయాలను ఉ.8.00 గం. నుంచి ఉ. 8.30 గం. వరకు, ఉ.10.00 గం. నుంచి ఉ.10.30 గం. వరకు, ఉ.11.00 గం. నుంచి ఉ.11.30 గం. మధ్య మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.నెట్ బ్యాంకింగ్ లో ఓటీపీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో రుసుముల చెల్లింపునకు మరో 10 సెకన్ల సమయాన్ని కేటాయించాలని కూడా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది.ఐఆర్‌సీటీసీ  రిజర్వేషన్ ప్రారంభమైన సమయం నుంచి తొలి అరగంట పాటు ట్రావెల్ ఏజంట్లు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వీలుండదు. ఏసీ కోచ్‌లో ప్రయాణానికి ఆన్‌లైన్ బెర్త్ రిజర్వేషన్ చేసుకునేవారు ఉ.10.00 గం., స్లీపర్ క్లాస్ బుకింగ్ చేసుకునేవారు ఉ.11.00 గం. బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.    రైలు ఆలస్య సమయం మూడు గంటలు దాటితే ప్రయాణికుడు పూర్తి టికెట్ చార్జీని తిరిగి పొందవచ్చు.    ప్రయాణికుడి సమ్మతం లేకుండా వేరే మార్గంలో రైలు వెళ్లినా… ప్రయాణికుడు పూర్తి టికెట్ చార్జీని తిరిగి పొందే వెసులుబాటును కల్పించింది.    ప్రయాణికుల ఇష్టం లేకుండా ఎగువ తరగతి నుంచి దిగువ తరగతికి మార్చినా మొత్తం చార్జీలు చెల్లించాల్సిందే. ఒకవేళ సమ్మతిస్తే టికెట్ అంతరంలో ఉన్న తేడాను ఈ మేరకు భర్తీచేస్తారు.
Tags: Railway Good News for book tickets online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *