Natyam ad

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి

– రైల్వే ఏఓకు బిజెపి వినతిపత్రం

పెద్దపల్లి ముచ్చట్లు:


పెద్దపల్లి కూనారం మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ బిజెపి నాయకులు రామగుండం జోన్ రైల్వే అధికారికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కార్యదర్శి నూనేటి వెంకటేష్ మాట్లాడుతూ,  జాతీయ లైను కావడం వల్ల గేటు వేసిన ప్రతీసారి అరగంట నుండి గంట వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారని, అత్యవసర వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. విద్యార్థులు, చిరు వ్యాపారులు, రైతులు వివిధ పనుల కోసం పెద్దపల్లికి రాకపోకలు సాగిస్తుంటారని తెలిపిన ఆయన గేటు వలన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని వివరించారు.  కేంద్ర ప్రభుత్వం రూ.వంద కోట్లు నిధులు విడుదల చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించక పోవడం సిగ్గు చేటన్నారు.  ఈ విషయమై రైల్వే బోర్డు సభ్యులు క్యాతం వెంకటరమణకు కూడా వివరించినట్లు ఆయన తెలిపారు.

 

Post Midle

Tags: Railway over bridge work should start immediately

Post Midle

Leave A Reply

Your email address will not be published.