మదద్ యాప్ తో రైల్వే సేవలు

Date:17/04/2018
న్యూడిల్లీ ముచ్చట్లు:
రైల్వేశాఖ మరో గొప్ప ముందడుగు వేసింది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్, హెల్ప్‌లైన్ ద్వారా వినియోగదారులకు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మొబైల్ యాప్ సేవలతో వినియోగదారుల ముందుకు రానుంది. ‘మదద్‌’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ యాప్‌ సేవలను ఏప్రిల్ నెలాఖరులో అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా… ఆహార నాణ్యత, టాయిలెట్ అపరిశుభ్రత వంటి పలు అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చు. అత్యవసర సేవల కోసం అభ్యర్థన కూడా పెట్టుకోవచ్చు.ఈ ఫిర్యాదులన్నీ నేరుగా సంబంధిత అధికారులకే చేరే విధంగా యాప్‌ను రూపొందించారు. దీంతో వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు ఏస్థాయిలో ఉంది, ఎలాంటి చర్యులు తీసుకుంటున్నారు వంటి వివరాలను కూడా వినియోగదారుడు యాప్‌లో చూడవచ్చు. రైల్వేకు సంబంధించి వివిధ ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థలన్నింటిని కూడా ఈ కొత్త యాప్‌ పరిధిలోకే తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.
Tags:Railway services with Madad App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *