Natyam ad

ఆర్టీసీ బాటలో రైల్వేలు

విజయవాడ ముచ్చట్లు:
 
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్టణాలు పల్లెకు పోతాయి. మహా నగరాలూ ఖాళీ అవుతాయి.నగరాలు, పట్టణాలలో ఉంటున్న వారంతా సొంతూళ్లకు పయనమవుతారు. అయితే ఇదే  అదనుగా, ప్రైవేటు ట్రావెల్స్, ట్రావెల్స్’కు పోటీగా ఎపీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంచి పండగ ఆనందానికి గండి కొడుతోంది.అయితే ఈ విషయంలో టీఎస్ ఆర్టీసీ ఈసారి ఆనవాయితీకి భిన్నంగా చార్జీలు పెంచకుండానే  అదనంగా బస్సులు నడుపుతోది. థాంక్స్ టూ ఆర్టీసీ ఎండీ సజ్జాన్నార్. అదలా ఉంటే,  అతనికంటే ఘనుడు అచంట మల్లన్న.. అన్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ కంటే దక్షిణ మధ్య రైల్వే  మరో నలుగు ఆకులు ఎక్కువే చదివిందా అన్నట్లుగా, సువిధ పేరిట,పండగ సమయాలు, బాగా రద్దీ ఉన్న మార్గాల్లో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తోంది. సువిధ’కు అవధులు లేవు అన్నట్లుగా ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్‌ ధరలను ఇష్టానుసారం పెంచేస్తోంది. మూడేళ్ల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సువిధ చార్జీలపై స్పందించి పండగ సమయాల్లో సామాన్య ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం వేయొద్దని అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు సూచించారు. పెద్దాయన చెప్పారనో ఏమో,రైల్వేశాఖ ఆ విధానాన్ని అప్పటికి  పక్కన పెట్టింది. మళ్లీ ఇప్పుడు సువిధ పేరుతో ఛార్జీల దోపిడీకి తెర లేపిందిఅదికూడా టికెట్’కు పదో ఇరవయ్యో కాదు, ఏకంగా ఐదారు రెట్లు పెంచేసి ప్రయాణీకుల ముక్కు పిండుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెగ్యులర్ ట్రైన్ టికెట్, రూ. 225, అదే సువిధలో అయితే,
 
 
రూ.1,135. అంటే,  ఇంచుమించుగా ఐదురెట్లు ఎక్కువ. అలాగే,  సికింద్రాబాద్‌-తిరుపతికి రెగ్యులర్‌ రైళ్లలో స్లీపర్‌ టికెట్‌ రూ.425 ఉండగా, 11న వెళ్లే సువిధ (నెం.82720) రైల్లో రూ.1000గా ఉంది. రూ.1,580గా ఉన్న థర్డ్‌ఏసీ టికెట్‌ ధరను రూ.2,935కు పెంచారు.కాచిగూడ నుంచి నర్సాపూర్‌కు రెగ్యులర్‌ రైల్లో ఫస్ట్‌ ఏసీ టికెట్‌ రూ.1,930 అయితే, సువిధ రైల్లో సెకండ్‌ ఏసీ ధరే రూ.2,890గా ఉండటం దోపిడీకి నిదర్శనమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్‌-విజయవాడల మధ్యే కాదు, హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, ఖమ్మం, కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి వంటి మార్గాల్లో ప్రయాణించే ‘సువిధ’ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. పండక్కి వెళ్లేటప్పుడే కాదు తిరుగు ప్రయాణంలోనూ టికెట్‌ ధరలు ఇదే తరహాలో ఉన్నాయి. 16న తిరుపతి-కాచిగూడ (నెం.82721), 17న నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ (82722) సహా మరికొన్ని సువిధ రైళ్లలోనూ టికెట్‌ ధరలు నాలుగైదు రెట్లు అధికంగా ఉండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.టికెట్ చార్జీల మోత అలా ఉంటే. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలంటూ కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ద.మ.రైల్వే ప్రయాణికుల ఆరోగ్యం కంటే, ఆడాయానికే  ప్రాధాన్యమిస్తోంది. దీంతో చాలా మంది సామాన్య ఉద్యోగులు పడగకు సొంతూరు వెళ్ళే ఆలోచనే విరమించుకుంటున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Railways on the RTC route