Natyam ad

హైదరాబాద్లో వర్ష బీభత్సం

-శనివారం   తెల్లవారుజామున భారీ వర్షం
జలమయమైన రోడ్లు
ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్ ముచ్చట్లు:


హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో  శనివారం  ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్నగర్, నారాయణగూడ, ఫిలింనగర్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో శనవారంతెల్లవారు జామున ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.నగరంలో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కాగా ఏపీ, తెలంగాణల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.

 

Post Midle

Tags: Rain disaster in Hyderabad

Post Midle