Natyam ad

మరో రెండు రోజులు వానలే వానలు

-తెలుగు రాష్ట్రాల్లో సిత్రాంగ్ టెన్షన్

విశాఖపట్టణం  ముచ్చట్లు:

Post Midle

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందట. దాంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్రవాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి ‘సిత్రాంగ్’ అని పేరు పెట్టారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో ‘వదలని’ అని అర్ధం. సిత్రాంగ్ ప్రభావంతోతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట.ప్రస్తుతం గంటగంటకు వాతావరణం మారుతోంది. అప్పుడే ఎండ దండికొడుతోంది. మళ్లీ కాసేపటికే భారీ వర్షం

 

 

పడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నాయి. ఈ వానలకు ఇప్పటికే వాగులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి.లోతట్టు ప్రాంతాలు అయితే వరద నీటిలో చిక్కికుపోయాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలకు జనాలుఅల్లల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భయంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు.మరోవైపు నవంబరులో ఏర్పడేవాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటావిస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ‘అక్టోబరులో నైరుతి రుతుపవనాల తిరోగమనంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణం. ప్రస్తుతం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతున్నాయి. అందుకే ఎన్నడూలేని విధంగా ఈసారి అధికంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వర్షాలు ఉంటాయి’ అని అన్నారు.

సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరణ సోమవారం ఉదయం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించినది.దీని ప్రభావంతో అక్టోబరు 20 తేదీనాటికి ఆగ్నేయ, దానిని అనుకోని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగాప్రయాణించి పశ్చిమ మధ్య ..  ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తదుపరి 48 గంటల్లో మరింత వ్యాపించనుంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణసూచనలు చేసింది అమరావతి వాతావరణ శాఖఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

 

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్ 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్లకురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతోకూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతోకూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్ 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరువర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .రాయలసీమ: ఈరోజు తేలిక పాటి

 

నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

 

Tags: Rains are rains for another two days

Post Midle

Leave A Reply

Your email address will not be published.