Natyam ad

21 వరకు వానలే వానలు

విశాఖపట్టణం ముచ్చట్లు:


రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు రానున్న రెండు రోజుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వాయువ్యాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.ఋతుపవన ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి ,భటిండా, ఢిల్లీ, హర్దోయి, వారణాసి, రాంచీ, బాలాసోర్ నుండి తూర్పు వైపు వాయువ్య,  ప్రక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం మీదుగా వెళ్తుందని పేర్కొంది. దీంతో ఏపీలో వివిధ ప్రాంతాలకు రానున్న మూడు రోజుల పాటు వాతావరణ సూచనలు చేసింది.ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్,  యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 21వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

 

 

 

భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 21వ తేదీ) వరకూ వివిధ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 21వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

 

Tags: Rains till 21st