బుధవారం దాక వానలు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఈ నెల 9వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ఆదిలాబాద్, వనపర్తి, సంగారెడ్డి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నాగర కర్నూల్, మహబూబ నగర్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి, సూజాతానగర్లలో 3.5 సెం.మీ. వర్షం కురియగా.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం  3.25 సెం.మీ., భద్రాది కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెంలో 3.10 సెం.మీ. వాన కురిసింది. గ్రేటర్ హైదరాబాద్లో రాగల ఐదారు  రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Rains until Wednesday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *