జగనన్న మార్ట్ లపై అవగాహన పెంచుకోండి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న  మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు డీపిఎం ప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపిఎం రవి ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్ట్ ల  పై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న మహిళా మార్ట్ల నిర్వాహణ, మహిళల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళా మార్ట్లలో నాణ్యమైన సరుకులు తక్కువధరలకే అందించనున్నట్లు తెలిపారు. మహిళలకు అనుకూలమైన గ్రామంలో మహిళా మార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై సీసీలు, సంఘమిత్రలు సభ్యులకు అవగాహన కల్పించి, మహిళా మార్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్‌ వాణిశ్రీ, గ్రూపు లీడర్లు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Raise awareness on Jagannath Mart

Post Midle
Natyam ad