కోవిడ్ నడవడిక , వ్యాక్సినేషన్ పై  ప్రజల్లో  విస్తృత అవగాహన కల్పించండి – జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి)  డా. మనజీర్ జిలానీ సమూన్

కర్నూలు ముచ్చట్లు:

కోవిడ్ నడవడిక , వ్యాక్సినేషన్ పై  ప్రజల్లో  విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి)  డా. మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు.. కోవిడ్ బిహేవియర్ , వ్యాక్సినేషన్  కమ్యూనికేషన్ అన్ అంశంపై  అన్ని శాఖల అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని  ప్రభుత్వ శాఖల అధికారులు వారి వారి పరిధిలో కోవిడ్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనే అంశాలతో పాటు వ్యాక్సినేషన్ పై కూడా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. మూడో వేవ్ రానుందని, నిపుణులు చెప్తున్న సందర్భంలో ఈ అంశాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు.. సోషల్ మీడియా లో జిల్లా అంతటా  పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు.. చివరి స్థాయి వరకు ఈ సందేశం అందరికీ వెళ్లేలా చూడాలన్నారు..ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,  అన్ని వర్గాలు, ప్రజలు అందరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు . ప్రచార సామగ్రి ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు…కరోనా తగ్గింది కదా అని నిర్లక్ష్యంగా ఉండోద్ధని ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు..

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Raise public awareness on Kovid behavior and vaccination
– Joint Collector (Development) Dr. Manazir Jilani Samoon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *