బుధవారం నాడు సీపీఐ ఛలో రాజ్ భవన్

హైదరాబాద్  ముచ్చట్లు :
బుధవారం నాడు ఛలో రాజ్ భవన్  కార్యక్రమం చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అన్నారు.
పేదల వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తామని అన్నారు. కృష్ణా జల్లాలో తెలంగాణకు న్యాయం జరిగింది. కేసిఆర్ వైఫల్యం వల్లనే సమస్య అని అన్నారు.అనేక ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు గా మారిపోయాయి. నికర జలాల కేటాయింపుల్లో అన్యాయం జరిగింది.  కృష్ణా పరివాహక ప్రాంతం అంతా తెలంగాణలో… నీటి కేటాయింపులు మాత్రం ఆంధ్రకు. కెసిఆర్..జగన్ ఇద్దరు దోస్తులు. కానీ జల వివాదం పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాల మద్య కొట్లాట అవసరం లేదు. కలిసి మాట్లాడుకోవడమే మంచిది.  సెంటి మెంట్ రాజకీయాలకు కృష్ణా జలాలను వాడుకోవద్దని అన్నారు.జల వివాదం మీద అఖిల పక్ష సమావేశం పెట్టండి. పిసిసి చీఫ్ గా కొత్త.. కానీ నాయకుడు పాతే. . అందరినీ కలుపుకుని పోతే మంచిది.  రేవంత్ వైఖరి బట్టి..  ఆ పార్టీ తో సంబంధాలు ఉంటాయి.  రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకుంటామని అన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Raj Bhavan at CPI Chalo on Wednesday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *