ఐదు కోట్ల ఎగ్గొట్టిన కేసులో రాజ్ గోపాల్ దోషి

Date:14/04/2018
ముంబై ముచ్చట్లు:
 తీస్తానంటూ ఒక వ్యాపారి నుంచి ఐదు కోట్ల రూపాయల డబ్బును తీసుకుని, తిరిగి చెల్లించని కేసులో బాలీవుడ్ కమేడియన్ రాజ్‌పాల్ యాదవ్ దోషిగా తేలాడు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకటి తీర్పునిచ్చింది. రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధను దోషులుగా తేల్చిన కోర్టు.. ఈ నెల 23న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నట్టుగా ప్రకటించింది. బాలీవుడ్ లో ఒక దశలో స్టార్ కమేడియన్‌గా వెలుగొందాడు రాజ్‌పాల్ యాదవ్. తనదైన టైమింగ్‌తో కామెడీని పండిస్తూ భారీ పారితోషకం తీసుకునే నటుల్లో ఒకడిగా నిలిచాడు. రామ్ గోపాల్ వర్మ హిందీలో రూపొందించిన అనేక సినిమాల్లో రాజ్‌పాల్ తప్పకుండా కనిపిస్తాడు. అలాగే ప్రియదర్శన్ తీసిన కామెడీ సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో రాజ్‌పాల్ ను చూడవచ్చు. ఆ మధ్యన తెలుగు సినిమా ‘కిక్ 2’లో ఇతడు నటించాడు. కేసు విషయానికి వస్తే.. 2010లో ఒక సినిమా తీస్తానని అంటూ రాజ్‌పాల్, అతడి భార్య తన దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని తీసుకున్నారని ముంబైకి చెందిన ఎంజీ అగర్వాల్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తాన్ని వారు తనకు చెల్లించలేదని, వడ్డీలతో కలుపుకుని అది ఎనిమిది కోట్ల రూపాయలకు చేరిందని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు రాజ్‌పాల్ ను దోషిగా నిర్ధారించింది. 23న శిక్షను ఖరారు చేయనుంది. 
Tags:Raj Gopal is convicted in a five crore extortion case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *