రాజ్ థాకరే కుమారుడి వివాహానికి చురుకుగా ఏర్పాట్లు

Raj Thackeray's son's wedding is active

Raj Thackeray's son's wedding is active

Date:14/01/2019
ముంబై ముచ్చట్లు:
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చకాచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖలకు వివాహ ఆహ్వానాలు కూడా అందాయి. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాత్రం ఇంతవరకు వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం. గత కొద్దికాలంగా మోదీపై విమర్శలు చేస్తున్న థాకరే తన కుమారుడి విహహానికి మోదీని ఆహ్వానించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజ్ థాకరే కుమారుడు అమిత్‌, ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ సంజయ్‌ బోరుడె కుమార్తె మిథాలి వివాహం జనవరి 27న లోవర్‌ పరేల్‌లోని సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఆహ్వానించడానికి రాజ్‌ థాకరే గతవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆయన తన సన్నిహతులైన హర్షల్‌ దేశ్‌పాండే, మనోజ్‌ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వానాలు పొందినవారిలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మేనకా గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ నేత శరత్ పవార్‌ను కూడా థాకరే అనుచరులు ఆహ్వానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఆహ్వానం అందుకున్నారు.
అయితే మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందలేదు. ఇదిలా ఉండగా.. ఆహ్వాన జాబితాలో మోదీ పేరు లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అందరినీ ఆహ్వానించి మోదీని విస్మరించడం పట్ల కారణం ఏమై ఉంటుందన్న విషయం చర్చకు దారితీసింది. అయితే కొద్దిరోజుల క్రితం కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్‌థాకరే స్పందిస్తూ.. ‘పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?’ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్ కూటమిగా ఏర్పడతాయన్న ప్రచారం జరుగుతోంది. రాజ్ థాక్రే కుమారుడి పెళ్లి కేంద్రంగా మహాకూటమిపై ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి. తన కుమారుడి పెళ్లికి రాహుల్ గాంధీ, శరద్ పవార్‌ని ఆహ్వానించిన రాజ్ థాక్రే..ప్రధాని మోదీని ఆహ్వానించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుతిరుగుతోంది మిత్రపక్షం శివసేన. ప్రధాని మోదీపై బాహాటంగానే శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఇరుపార్టీ మధ్య వైరం బాగా పెరిగింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో మహారాష్ట్రలో మహాకూటమి ఏర్పడితే బీజేపీ ఎదురీదక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:Raj Thackeray’s son’s wedding is active

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed