లా నేస్తం నిధులు విడుదల చేసినందుకు హర్షం చేసిన రాజారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం లోనికి వచ్చిన వెంటనే గత మూడు ఏళ్ల నుండి జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం పేరుతో ఇస్తున్న డబ్బులను ఈ రోజు వారి ఖాతాలో జమ చేయడాన్ని హర్సిస్తున్నట్లు న్యాయవాది, వై యస్ ఆర్ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి ఇక ప్రకటనలో తెలిపారు.బుధవారం ఉదయం లా నేస్తం కింద 1,00,55,000కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్ నొక్కి జూనియర్ న్యాయవాదుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలల్లో భాగంగా జూనియర్ న్యాయవాదుల ను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందనీ, లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలో కీ వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని నిలబడటానికి వీలుగా అర్హులైన ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నదని ఇప్పటి వరకు 4248మంది న్యాయవాదులకు మూడేళ్ల పాటు అందించిన సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు 100కోట్ల రూపాయలు కార్పస్ పండ్ సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Tags: Raja Reddy was happy for the release of funds from Law Nestam

