రాజమహేంద్రవరం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం

Rajahmhendravaram Brahmin service union conference

Rajahmhendravaram Brahmin service union conference

Date:22/04/2018

రాజమహేంద్రవరంముచ్చట్లు:

రామనుజా చార్యుల వారి 1001 జయంతి సందర్భంగా APBSSS అధ్యక్షులు శ్రీ జ్వాలపురం శ్రీకాంత్  అధ్యక్షతన నఖచిత్ర కారుడు శ్రీ పరస రవి  స్వగృహంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామనుజా చార్యులు వారి గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజానికి చేసిన సేవ వెయ్యి సంకత్సరాలు అయినా మరువలేనిది .జీవుడు , ప్రకృతి, శివుడు ఈ సృష్టి అంతా ఆవరించి శ్రీమన్నారాయణ వారి అంశము. కుల, వర్ణ బేధాలకు తావులేదని బోధించి విశిష్ట అద్వైతంలో ముందుకు తీసుకువెళ్లిన రామనుజా చార్యులు వారిని మరువలేము. 1000 సంవత్సరాల క్రితం గిరిజనులకు, హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇటువంటి జయంతిని జరుపుకోవడం సమాజానికి మంచి మార్గదర్శం అయ్యారు. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు దేశమంతా తిరిగి నలుమూలలకు చాటిచెప్పిన దైవంశసంభూతుడు అని రాష్ట్ర అధ్యక్షులు జ్వాలపురం శ్రీకాంత్  కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరస రవి, భువనగిరి వెంకటరమణ, మాచిరాజు రవికుమార్,తేజోమూర్తుల లక్ష్మీనరసింహ మూర్తి, కోలగంటి రమేష్, పూజ్యం మణికుమార్, భమిడిపాటి సుబ్బారావు, , గన్నవరపు వీరేశ్,సిరిపురపు రమేష్  పాల్గొన్నారు.

Tags: Rajahmhendravaram Brahmin service union conference

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *