ప్రమాదవశాత్తు గాయపడిన గన్‌మ్యాన్, డ్రైవర్, సిబ్బందిని పరామర్శించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
-మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశం
-అన్ని విధాలుగా ఆదుకుంటాం…. అధైర్య పడకండి
రాయచోటి ముచ్చట్లు:

సంక్రాంతి పండగ పురస్కరించుకొని పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డితో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తన అమ్మమ్మ గారి ఊరు అన్నమయ్య జిల్లా వీరబల్లికి వస్తుండగా మార్గమధ్యమైన రాయచోటి చెన్నముక్క పల్లి రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు గాయపడి సోమవారం రాత్రి తిరుపతిలో చికిత్స పొందుతున్న ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్లను, డ్రైవర్, సిబ్బందిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి ధైర్యం ఇచ్చారు.
Tags: Rajampet MP Mithun Reddy visited the gunman, driver and staff who were injured in the accident.
