రాజనాల బండలో హుండీ రాబడి రూ:4.80 లక్షలు

చౌడేపల్లె ముచ్చట్లు:


సత్యప్రమాణాలకు నిలయమైన శ్రీ లక్ష్మినరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కింపు చేపట్టగా రూ:4.80 లక్షలు ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శ శికుమార్‌ తెలిపారు. ఈ లెక్కింపులో నగదు, చిల్లర కానుకలు రూ:4,80,306 రూపాయలు సమకూరిందన్నారు. వీటిని ఆలయ ఖాతాను నగదు జమచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మినరసింహులు, విఆర్వో మల్లికార్జునరెడ్డి, గ్రామస్తులు నాగరాజ,మునిరాజ, శ్రీనివాసులు,ఈశ్వరయ్య, వెంకటరెడ్డి, అర్చకులు కృష్ణప్ప, లక్ష్మినారాయణ, తదితరులున్నారు.

 

Tags: Rajanala Bandalo Hundi revenue is Rs: 4.80 lakhs

Leave A Reply

Your email address will not be published.