రాజన్న విగ్రహానికి పాలాభిషేకం

Rajanna is the epitome of statue

Rajanna is the epitome of statue

Date:08/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 104, 108 ఉద్యోగులు కలసి శుక్రవారం పాలాభిషేకం చేశారు. యూనియన్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీన్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలసి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రవీన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ 104, 108 ఉద్యోగులకు రూ.28 వేలు, అలాగే పారామెడికల్‌ స్టాప్‌కు రూ.30 వేలు పెంచడం , వైద్యులకు సర్వీస్‌ వైటేజ్‌ ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డ ఉద్యోగులకు జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, ఇమ్రాన్‌, జాషువ, స్వర్ణలత, మంజు, హిమజ తదితరులు పాల్గొన్నారు.

మాయమైపోతున్నతడకలేరు వంక

Tags: Rajanna is the epitome of statue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *