Natyam ad

పుంగనూరు మండల సచివాలయాల కన్వీనర్‌గా రాజశేఖర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల సచివాలయాల కన్వీనర్‌గా రాజశేఖర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర్‌రెడ్డిని సన్మానించి , నియామకపుపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో కన్వీనర్‌గా నియమించినందుకు మంత్రి కుటుంభానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధివిధానాలను మండల ప్రజలకు వివరించి, పటిష్టం చేస్తామన్నారు.

 

Post Midle

Tags: Rajasekhar Reddy as the convener of Punganur mandal secretariats

Post Midle