మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు ఏడవ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. శంఖు చక్రాలను చేతపట్టిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు. శరన్నవరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్ధం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగుతోంది.

Tags: Rajashyamala in incarnation of Mahalakshmi
