Date:30/11/2020
హైదరాబాద్ ముచ్చట్లు
ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నిన్న సాయంత్రం వరకు జరిగిన ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లొంగిపోయిందని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ డబ్బులు పంపకాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు రాజా సింగ్.డబ్బులు పంచుతుంటే.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు దారుణమన్నారు రాజాసింగ్. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. సైదాబాద్‌లో టీఆర్ఎస్ నాయకుల గుండా గిరికి దిగారు. సింగరేణి కాలనీలో ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్న బిజిపి అభ్యర్థి భర్త పై దాడికి దిగారు. కర్రలతో దాడి తల పగలగొట్టారు టీఆరెస్ నాయకులు. తల పగలడంతో స్థానిక హాస్పత్రికి తరలించారు. బాధితుడ్ని బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ పరామర్శించారు. ఈ దాడిపై స్పందించిన రాజా సింగ్ ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యారు.
Tags:Rajasingh Sirius