రాజస్థాన్ లేడీ గ్యాంగ్ హల్ చల్

వరంగల్  ముచ్చట్లు:


రాజస్థాన్ లేడీ గ్యాంగ్ రోజుకో చోట హల్ చల్ చేస్తున్నారు.. హై వే పై వాహనదారులను ఆపి బలవంతపు వసూళ్లుకు పాల్పడుతున్నారు.. వరంగల్- ఖమ్మం మధ్య జాతీయ రహదారిపై వాహనదారులను ఆపి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్న యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అదుపులోకి తిసున్న పోలీసులు..ఈ ముఠా వరంగల్- ఖమ్మం మద్య ఇళ్లంద సమీపంలో మాటు వేశారు.. జాతీయ రహదారిపై వచ్చి పోయే వాహనాలను ఆపి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.. ఈ యువతుల ముఠా హల్ చల్ చూసి బెంబేలెత్తిపోయిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు..ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం హైవేపై లేడీ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. వ‌చ్చీ పోయే వాహ‌నాల‌న్ని ఆపుతూ డ‌బ్బు వసూళ్లకు పాల్పడింది. వాగ్ధేవి కాలేజీ స‌మీపంలో సుమారు ఎనిమిది నుంచి 12 మంది వ‌ర‌కు మ‌హిళ‌లు జీన్స్ పాయింట్, టీ ష‌ర్ట్స్ వేసుకొని ఉన్నారు. రోడ్డుపై వ‌చ్చీ పోయే వారిని ఆపుతున్నారు. వారి వ‌ద్ద నుండి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా రాజస్థాన్ కు చెందిన అమ్మాయిలుగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క‌న‌బ‌డితే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు.

 

Tags: Rajasthan Lady Gang Hull Chal

Leave A Reply

Your email address will not be published.