అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ పచ్చజెండా           వేడెక్కిన రాజస్తాన్ రాజకీయాలు

Date:30/07/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా పచ్చజెండా ఊపడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరి శిబిరాలు వారి వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే సచిన్ పైలట్ వర్గం మాత్రం మరింత పదునైన వ్యూహాలతో రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యింది.తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరై తీరుతామని పైలట్ వర్గంలోని ఓ ఎమ్మెల్యే గురువారం ప్రకటించారు. అయితే తాము జైపూర్‌కు వస్తే… పోలీసులు తగిన రక్షణ కల్పించాలని పైలట్ వర్గం  డిమాండ్ చేసింది. అయితే… జైపూర్‌కు ఎప్పుడు వచ్చేది మాత్రం పైలట్ వర్గం వెల్లడించలేదు.ఆగస్టు 02 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా అనుమతి ఇచ్చారు. అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతూ అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు పంపిన మూడు ప్రతిపాదనలను తిరస్కరించిన గవర్నర్‌.. ఎట్టకేలకు నాలుగో ప్రతిపాదనను ఆమోదించారు. బుధవారం ముఖ్యమంత్రి గెహ్లోత్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మిశ్రాతో  భేటీ అయ్యారు.

 

జగన్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు

Tags:Rajasthan politics as governor heats green flag for assembly sessions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *