వైయస్సార్ సిపి నేతల కుటుంబాల పరామర్శకు రాజేష్
శ్రీరంగరాజపురం ముచ్చట్లు:
గంగాధర నెల్లూరు నియోజకవర్గమైన శ్రీరంగరాజపురం/వెదురుకుప్పం మండలాల్లోని గ్రామాలైన ములూరు ఎస్ఆర్ పురం మండల వైఎస్ఆర్సిపి మాజీ కన్వీనర్ కే అనంతరెడ్డి కోడలు, వెదురు కుప్పం మండలం చవటగుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులైన ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వరి రెడ్డిల తల్లి బండి జయమ్మలు ఇటీవల మరణించారు. సందర్భంగా వారు స్వగ్రామంలో గురువారం శుభ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, రాజకీయ ఉద్దండురాలైన గుమ్మడి కుతూహలమ్మ తనయుడు ఎన్. రాజేష్ వారి కుటుంబాలకు వెళ్లి ఓదార్చారు. అనంతరం నాయకులతో కలిసి మృతుల ఫోటోలకు పుష్పాంజలి ఘటించారు.రాజేష్ రాకతో వైఎస్ఆర్సిపి నేతల్లో ఉత్సాహంఈ సందర్భంగా హాజరైన ఎన్. రాజేష్ కు పలువురు మాజీ నేతలు, కార్యకర్తలు అతనితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క నేత కార్యకర్తలు అతనిని కలిసారు. ఇదే సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా రాజేష్ ఒకరు గా ఉంటారని గుసగుసలు వినిపించినాగాయి. ఇదే సందర్భంగా కొందరు నేతలు బహిర్గతంగా రాజేష్ ను కలిశారు.

Tags: Rajesh to meet families of YSRCP leaders
