డ్రైవ్ చేసుకుంటూ ర‌జ‌నీ బిందాస్

Date:30/10/2020

గుంటూరు ముచ్చట్లు:

పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ ఏది జ‌రిగినా అది ఇంకొక‌రితో కంపారిజ‌న్ కి వాడుకుంటూ కామెడీలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ లీడ‌ర్ నారా లోకేశ్ ది కూడా అదే ప‌రిస్థితి. పాపం నారా లోకేశ్. సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ట్రాక్ట‌రే న‌డ‌పడం చేత‌కాదు.. పార్టీని ఎలా న‌డుపుతావ్ అని కొంత‌మంది.. ప‌ది మందిని క‌రెక్ట్ గా ప్రొటెక్ట్ చేయ‌లేకుంటే.. రాష్ట్రాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తావ్ అని ఇంకొంత‌మంది.. ఏంటిరో.. మీ సార్ ట్రాక్ట‌ర్ డొల్ల‌కొట్టాడ‌ట క‌దా అని.. కార్య‌క‌ర్త‌ల్ని అంటూ కామెడీలు చేసుకుంటున్నారు.ఇదే టైమ్ లో వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ట్రాక్ట‌ర్ ఎక్కారు. ఎంచ‌క్కా.. డ్రైవ్ చేసుకుంటూ బిందాస్ గా వెళ్లారు. ఇప్పుడీ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. అంద‌రూ చూస్తున్నారు. మామూలుగానే విడ‌ద‌ల ర‌జ‌నీకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువుంది. మీడియాలో ఇంకాస్త ఎక్కువుంది. ఈ ట్రాక్ట‌ర్ తో ఇంకాస్త సెటైర్ గా మారింది. విడ‌ద‌ల ర‌జ‌నీ మామూలుగా ఇంత‌కు ముందు కూడా ట్రాక్ట‌ర్ న‌డిపారు. ఆమెకు బానే ఆల‌వాటున్న‌ట్లుంది. కానీ.. సిచ్చువేష‌న్ వేరు క‌దా. లోకేశ్ కి ఇది సెటైర్ గా మారింది. లోకేశ్ కి ట్రాక్ట‌రే న‌డ‌పడం చేత‌కాలేదు.. బుర‌ద‌గుంట‌లోకి దించారు.. మా ర‌జ‌నీ మేడ‌మ్ చూశారా ఎలా న‌డిపారో అంటూ.. కిందిస్థాయిలో కామెడీలు చేసుకుంటున్నారు. కింది స్థాయిలో ఏంటి.

 

 

అంద‌రూ అలాగే మాట్లాడుకుంటున్నారు.పాపం నారా లోకేశ్. త‌ను న‌డిపింది వ‌ర‌ద నీటిలో. రోడ్డు మొత్తం ఫుల్ గా నీళ్లున్న‌య్. దారి క‌నిపించ‌నే లేదు. ఇక ఆ ట్రాక్ట‌ర్ మీద జ‌నాలు ఫుల్ గా ఉన్నారు. ట్ర‌క్కు కూడా ఉండ‌డంతో.. ఫాలోవ‌ర్స్ అంతా ట్రాక్ట‌ర్ ఎక్కారు. బుర‌ద కావ‌డంతో.. వీలైనంత మంది ఎక్కి స‌ర్దుకుని కూర్చున్నారు. లోకేశ్ న‌డుపుతుండ‌డంతో.. ఇంకా టైట్ గా ఎక్కారు. ఫైన‌ల్ గా ఎక్క‌డో బెసికింది.. దారి త‌ప్పింది.. బుర‌ద గుంట‌లోకి కూరుకుపోయింది. వ‌ర‌ద నీరు క‌దా.. కంట్రోల్ కాలేదు. కానీ ఏం చేస్తాడు చెప్పండి. ఇవ‌త‌ల ఉంది విడ‌ద‌ల ర‌జ‌నీ కదా.. కంపార్ చేస్తూ‌.. లోకేశ్ ని ట్రోల్ చేస్తున్నారు.

ప‌వ‌న్ కిం క‌ర్త‌వ్యం

Tags: Rajini Bindas while driving

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *