చంద్రబాబు తో రజనీకాంత్ భేటి!
హైదరాబాద్ ముచ్చట్లు:
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌కి వచ్చిన రజనీకాంత్.. దాదాపు చంద్రబాబుతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసేందుకు ముందుగానే రజనీకాంత్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం. ఆదివారం జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు అంటూ వైసీపీ వర్గాలు చర్చలు జరుపుతుండటం విశేషం. పవన్ కల్యాణ్ కలిసి 24 గంటలు కూడా కాకముందే.. చంద్రబాబును సూపర్ స్టార్ రజనీకాంత్ కలవడం విశిష్టతను సంతరించుకుంది.చంద్రబాబు-రజనీకాం
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు, అలాగే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలన్నీ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన ట్విట్టర్ వేదికగా తన ఫ్రెండ్ రజనీకాంత్‌ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ.. రజనీకాంత్‌ని శాలువాతో సత్కరిస్తున్న ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags; Rajinikanth met with Chandrababu!
