రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం

Rajiv Gandhi Khel Ratna Award

Rajiv Gandhi Khel Ratna Award

Date:17/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును సిఫారసు చేశారు. కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను పేర్లను సంయుక్తంగా ఈ పురస్కారానికి సిఫారసు చేశారు.
ఈ ప్రతిపాదనకు క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తే.. ఖేల్ రత్న సాధంచిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలవనున్నాడు. ఇప్పటి వరకూ క్రికెట్ నుంచి సచిన్ టెండుల్కర్ (1997), మహేంద్ర సింగ్ ధోనీ (2007) మాత్రమే ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించింది.
కామెన్వెల్త్ క్రీడల్లోనూ చాను పసిడి పతకాన్ని గెలుపొందింది. కానీ గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైంది. ఇప్పటి వరకూ కరణం మల్లీశ్వరి (1995), కుంజరాణి (1996) మాత్రమే వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశం నుంచి ఖేల్‌రత్న సాధించారు. ఈసారి ఖేల్‌రత్న పురస్కారం కోసం బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ పేరు కూడా కమిటీ పరిశీలించినట్టు తెలుస్తోంది.
Tags: Rajiv Gandhi Khel Ratna Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *