13 రాజ్యసభ స్థానాలకు మోగిన ఎన్నికల నగారా..

ధిల్లీ: దేశం మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే ఆరు రాష్ట్రాల పరిధిలో మొత్తం 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ లో 5, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ, ప్రతాప్సింగ్ బజ్వా నరేశ్ గుజ్రాల్ వంటి నేతలు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది..

Leave A Reply

Your email address will not be published.