Natyam ad

భారీ వృక్షానికి రాఖీ

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రకృతితో తమకున్న అనుబందాన్ని విశాఖలో విద్యార్ధులు వినూత్నరీతిలో చాటి చెప్పారు.అన్నా చెల్లెల మద్య అనుబందాన్ని తెలియచేసే రాఖీని భారీ వృక్షానికి కట్టి పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంపై ఉన్న ప్రాధాన్యతను వివరించారు.దేశీయ విత్తనాల రాఖీతో వృక్షా బంధన్ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం మూడు వందల మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించి ఆకట్టుకున్నారు.తమ సోదరులు సుఖ సంతోషాలతో… శాంతి, సౌభాగ్యాలతో… ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ  అక్క, చెల్లెల్లు రాఖీలు కట్టడం సాధారణం.అదే రీతిలో ప్రకృతి వినాశనానికి పాల్పడ కుండా పర్యావరణ పరిరక్షణ కూడా భాద్యతతో ముందుకు రావాలని కోరుతూ విశాఖలోని విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ వృక్షానికి రాఖీ కట్టారు. రైల్వేస్టేషన్ కు దగ్గరలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షానికి విద్యార్థులు రాఖీ కట్టి చెట్లను సంరక్షించాలని అవగాహన కల్పించారు. భవిష్యత్ తరాలకు ఈ భూమిని భద్రంగా అందించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

Post Midle

విశాఖ జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల పోరం అధ్యక్షురాలు శశి ప్రభ మాట్లాడుతూ వృక్షాబంధన్ కార్యక్రమం వందలాది మంది విద్యార్థులతో నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. దీనివల్ల చాలా మంది విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అన్నారు. దేశీయ విత్తనాల పరిరక్షణ, వందల సంవత్సరాల నాటి వృక్షాల పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలని చెప్పారు.ప్రతి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములు చేయడం అవసరమని చెప్పారు.భవిష్యత్తు తరమైన విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు పనికొచ్చే అన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందుకే తమ విద్యార్థులతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

 

Tags: Rakhi for huge tree

Post Midle

Leave A Reply

Your email address will not be published.