రక్షిత్ శెట్టి పాన్ ఇండియా మూవీ ‘777 చార్లి’ టీజర్ విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

హైదరాబాద్‌ ముచ్చట్లు:

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 చార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. ఆదివారం(జూన్‌6) నాడు ర‌క్షిత్ శెట్టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను ఆదివారం నేచుర‌ల్ స్టార్ త‌న వాల్‌పోస్ట‌ర్ సినిమా యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

 

 

 

టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ‘ఏంటో ఏమో ఎవ‌రెవ‌రో నిండిన దారుల్లో…’ అంటూ సాగే ఈ పాటను వినొచ్చు. మాంటేజ్ సాంగ్‌లో, కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా చార్లి అనే కుక్క ఓ ఇంటి నుంచి పారిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అది ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. ధ‌ర్మ‌(ర‌క్షిత్ శెట్టి)ని ఎలా క‌లుసుకుంటుంది. వారిద్ద‌రూ క‌లుసుకున్న త‌ర్వాత ఏమ‌వుతుంది? అనే అంశాల‌ను ఎలివేట్ చేశారు. అలాగే ర‌క్షిత్ శెట్టి పోషించిన ధర్మ అనే క్యారెక్ట‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. చార్లి, ధర్మ..ఇద్దరూ కలుసుకున్న తర్వాత వారెలాంటి సాహసం చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని, త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Rakshit Shetty Pan India Movie ‘777 Charlie’ Teaser Released By Natural Star Nani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *