ఎన్టీఆర్ బయోపిక్ లో అందాల నటిగా రకుల్

Rakul is a beauty actress in NTR biopic

Rakul is a beauty actress in NTR biopic

Date:10/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుండి మరో ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు గానూ గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నాడు రకుల్ ప్రీత్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెల్లటి చీరలో ‘వేటగాడు’ చిత్రంలోని ‘ఆకుచాటు పింద తడిచె’ సాంగ్ కాస్ట్యూమ్స్‌లో అలనాటి అందాల తారను గుర్తు చేస్తూ అదిరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్‌లో దాదాపు 14 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హిట్ కాంబినేషన్ అయ్యింది. ఇక ‘వేటగాడు’ చిత్రంలోని ‘ఆకుచాటు పింద తడిచె’ సాంగ్ సన్సేషనల్ హిట్ అయ్యింది. తాజాగా ఇదే సాంగ్‌ను బాలయ్య-రకుల్‌పై చిత్రీకరించనున్నారు.
Tags:Rakul is a beauty actress in NTR biopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *