టాలీవుడ్ లో టాక్  ఆఫ్ ఇండస్ట్రీగా రకుల్

Rakul is the talk of industry in Tollywood

Rakul is the talk of industry in Tollywood

Date:13/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఒకప్పుడు టాప్ హీరోలందరికీ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే వరుస ఫ్లాప్‌లు వెంటాడటంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్‌కు దూరమైంది. ‘స్పైడర్’, ‘విన్నర్’ చిత్రాలు నిరాశపరడంతో కాస్త డల్ అయ్యింది. ‘ఖాకీ’,‘జయ జానకీ నాయకా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో పర్వాలేదనిపించింది. ఇక కీర్తి సురేష్, పూజా హెగ్డే, అను ఇమ్మానుయేల్‌ హవా నడుస్తుండటంతో రకుల్ జోరు తగ్గింది. అయితే సినిమా పరంగా కాస్త డల్ అయ్యినా రెమ్యునరేషన్‌లో నో కాంప్రమైజ్ అంటోంది ఈ ఢిల్లీ సుందరి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో బాలయ్యతో జోడి కడుతోంది.
ఈ సినిమాలో అలనాటి అందాల సుందరి శ్రీదేవి పాత్రలో మెరవనుంది ఈ భామ. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రకుల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయడంతో అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంది రకుల్. శ్రీదేవి పాత్రలో తెల్లటి చీరలో తడిచిన అందాలతో బాలయ్యతో కలిసి ‘ఆకుచాటు పింద తడిచే’ సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది. అయితే ఇక్కడ శ్రీదేవితో పోలిక రావడంతో అబ్బే.. రకుల్ పెద్దగా సెట్ కాలేదు, శ్రీదేవితో ఆమెకు పోలిక ఏంటి? అన్న పెదవి విరుపులు ఎక్కువ అయ్యాయి.
నిజానికి శ్రీదేవితో రకుల్‌ ఊహించుకోవడం అత్యాశే అవుతుంది. దీన్ని పక్కనపెట్టేస్తే.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో శ్రీదేవి పాత్రకు గానూ భారీగా పారితోషికం అందుకుందట రకుల్ ప్రీత్ సింగ్. సుమారు 20 నిమిషాల పాటు ఉండే ఆమె పాత్రకు గానూ ఏకంగా రూ. కోటి రేటు పలికిందట. ప్రస్తుతం ఈ వార్త గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 20 నిమిషాలకు కోటి రూపాయలే.. అంటూ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది రకుల్.
మరి ఇంత సమర్పించిన తరువాత రకుల్‌ను నామమాత్రంగానైనా దర్శకుడు క్రిష్.. శ్రీదేవిగా చూపించకుండా ఉంటారా ఏంటి? అన్నట్టు మొన్న వర్షంలో బాలయ్య, రకుల్‌పై ‘ఆకుచాటు పింద తడిచే’ సాంగ్ చిత్రీకరణ పూర్తి కాగా.. ‘బొబ్బిలిపులి’ చిత్రంలోని కీలక సన్నివేశాలను బాలయ్య, రకుల్‌లపై షూట్ చేస్తున్నారట. ఆ చిత్రంలో శ్రీదేవి లాయర్ పాత్రలో కోర్టులో గడగడలాడించింది.. మరి రకుల్ ప్రీత్ సింగ్‌కు కోటి ఇచ్చి లాయర్ కోటు తొడుగుతారేమో చూడాలి.
Tags:Rakul is the talk of industry in Tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *