Natyam ad

వివిధ గ్రామాలలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీలు

రామడుగు ముచ్చట్లు:

రామడుగు మండలం వెధిర గోపాల్ రావు పేట కోరుటపల్లి గ్రామాలలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. కోరుటపెళ్లిలో  ముఖ్యఅతిథిగా ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ పాల్గొని వీధి వీధిలో తిరుగుతూ ప్రతి ఇంటి పై జెండా ఎగురవేసి స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెదుర గ్రామంలో విద్యార్థులచే ఘనంగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రామడుగు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు ఎంపీడీవో మల్హోత్రా గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొరటపల్లి లో సర్పంచ్ మన్నె దర్శన్ రావు కార్యదర్శి ఎట్టెం రాజు అంగన్వాడి టీచర్ మన్నే అమృత గ్రామ సిఏ మన్నే శాంత గ్రామ కారోబర్ దుర్శేటి మహేశ్వరి నాయకులు కట్ట రవీందర్ బుర్ర శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గోపాల్ రావు పేట గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి పాపిరెడ్డి కర్ర వెంకటరెడ్డి కార్యదర్శి బుర్ర ప్రసాద్ శ్రీనివాస్ మహిళా సంఘాల సిఏలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Rallies as part of Independence Vajrotsavam in various villages

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.