బుల్లెట్ ట్రైన్ కు  వ్యతిరేకంగా ర్యాలీ

Date:07/02/2019
గాంధీనగర్ ముచ్చట్లు:
అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు గుజరాత్‌లోని నవ్‌సరిలో నిన్న నిరసన ర్యాలీ చేపట్టారు. దాదాపు 2 వేల మంది రైతులు తమ నిరసనను తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లి అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా వీరు 14 అంశాలను ప్రస్తావించారు. రైతు నాయకుడు జయేశ్ పాటీల్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించదలచిన భూమి గ్రీన్ కారిడార్ జోన్ పరిధిలో ఉంది. అంతేకాకుండా 2 లక్షలకు పైగా చెట్లను నరికివేయాల్సి వస్తుంది. కావునా గ్రీన్ జోన్ నాశనానికి తాము సహకరించేది లేదని పేర్కొన్నారు. 2018 జూన్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ ప్రతిష్టాత్మక ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అనుకున్న గడువు కంటే ఏడాది ముందుగానే 2022 నాటికి పూర్తి అవుతదన్నారు. అహ్మదాబాద్-ముంబయి మధ్య నడిచే ఈ రైలు మొత్తం ప్రయాణమార్గం 508 కిలోమీటర్లు. దీంట్లో 21 కిలోమీటర్ల మార్గం సముద్రగర్భంలో ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 1.10 ట్రిలియన్లు కాగా టన్నెల్ మార్గ వ్యయం రూ. 3,500 కోట్లు. ఇందులో నామమాత్ర వడ్డీకి జపాన్ రూ. 88 వేల కోట్లను సమకూర్చనుంది.
Tags: Rally against bullet train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *