చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ

Date:12/02/2019
చిత్తూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపిపై చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని బిజెపి నాయకులు రాష్ట్రకార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు  అనంతరం రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్టని రానున్న ఎలక్షన్ లో తను తన పార్టీ ఓడిపోతానని గ్రహించి కేంద్ర నిధులను ఉపయోగించుకోని తమ పార్టీ పేరిట పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేస్తున్నట్లు నటిస్తున్నాడని  స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అప్పట్లో తెలుగుదేశం పార్టీని నిర్మించారని కానీ ఆ నా ఆశయాలని పక్కన పెట్టి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని  రానున్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు కి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని  ఇకనైనా బిజెపి ని విమర్శించడం మాని తనపని తాను చూసుకుంటే బాగుంటుందని లేనిపక్షంలో రానున్న ఎలక్షన్ లో అటు ఆంధ్రప్రజలు ఇటు బిజేపి పార్టీ తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని అన్నారు  అదేవిధంగా సినీ హీరో శివాజీ అంతా తనకే తెలుసు అంటూ గొప్పలు చెప్పుకుంటూ జల దీక్ష అంటూ దొంగ దీక్షలు చేస్తూ బీజేపీని విమర్శించడం తగదని ఇదేవిధంగా బిజెపిని విమర్శిస్తూ ఉంటే అతనిని గుడ్డలు విప్పి కోట్ట వలసిన పరిస్తితి వస్తుందని బిజెపి నాయకులు హీరో శివాజీ కి హెచ్చరికలు జారీ చేశారు.
Tags:Rally as protest against Chandrababu’s comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *