Rally by leaders under YSRCP

వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నాయకులచే ర్యాలీ

– కరోనాపై అవగాహన

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కృషి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి , నాగరాజారెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటరెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, అమరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో అవగాహన చేపట్టారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలు ఇండ్లలోనే ఉండిపోవాలని సూచించారు. వ్యాదిని నియంత్రించేందుకు బయట తిరగడం శ్రేయస్కరం కాదన్నారు. ఐకమత్యంతో వ్యాదిని నియంత్రించాలని సూచించారు. కష్టతరమైన బాధ్యతతో భరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అమ్ము, మనోహర్‌, రేష్మా, కమలమ్మ, మహబూబ్‌బాషా, లలితారాణి, రాజేష్‌, బండకుమార్‌, రాఘవ, బాలు తదితరులు పాల్గొన్నారు.

బిచ్చగాళ్లకు అన్నం పెట్టిన పోలీసులు

Tags: Rally by leaders under YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *