Rally of Rama devotees in Srikalahasti

శ్రీకాళహస్తిలో రామభక్తుల ర్యాలీ

Date:5/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి పట్టణంలోని  నాలుగు మాడ వీధుల్లో  రామ భక్తులు రామనామ స్మరణ చేస్తూ ర్యాలీ చేశారు. బుధవారం సాయంత్రం దీపాలు వెలిగించి శ్రీరామునికి స్వాగతం పలకాలని  ఆర్ఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం భూమిపూజ పురస్కరించుకొని సకల రామ భక్తులను సన్నద్ధం చేయడంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రామ సంకీర్తన భజన ర్యాలీ చేపట్టారు. స్థానిక సన్నిధి వీధి లోని రామ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీరాముని చిత్రపటాన్ని చేతబూని రామనామ నామస్మరణ చేస్తూ నాలుగు మాడవీధుల్లో ర్యాలీ చేశారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర పుణ్యభూమిలో బుధవారం రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా సకల రామ భక్తులను సన్నద్ధం చేయడంలో భాగంగా శ్రీరామ సంకీర్తనం ర్యాలీ చేపట్టామన్నారు. బుధవారం సాయంత్రం ప్రతి ఇంటి గడప వద్ద దీపాలు వెలిగించి శ్రీరామునికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు

 

కల్లు ఇవ్వలేదని కత్తితో పోడిచాడు

Tags:Rally of Rama devotees in Srikalahasti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *