ప్రత్యేక హోదాకోసం వైసీపీ నాయకుల ర్యాలీ

Rally of the VIP leaders for special status

Rally of the VIP leaders for special status

Date:16/03/2018

పలమనేరు ముచ్చట్లు:

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పట్టణ వైసీపీ విద్యార్థి విభాగం ఆద్వర్యంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 హామీలను కేంద్రప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు శుక్రవారం స్థానిక సాయిబాబా గుడి వద్దనుంచి ర్యాలీని ప్రారంభించి ‘ఏపికి ప్రత్యేక హోదా కావాలంటూ’ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ కూడలిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి బిజెపి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ సివికుమార్, కాపునేత ఆకులగజేంద్ర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, కన్వీనర్లు మోహన్ రెడ్డి, బాగారెడ్డి, జిల్లా ముస్లిం సెల్ ప్రధాన కార్యదర్శి సుహేబ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాద, విద్యార్థి నాయకుడు నాగేంద్ర రెడ్డి, నరేష్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Rally of the VIP leaders for special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *