ఫసల్ బీమా పథకంపై అవగాహన ర్యాలీ

Rally on Fasal Insurance Scheme

Rally on Fasal Insurance Scheme

Date:16/11/2018
ఒంగోలు ముచ్చట్లు:
జిల్లాలో రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల భీమా పథకాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైర్ క్టర్ .పి.వి.శ్రీ రామమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలు  ప్రకాశం భవనంలో పధాన్నిమంత్రి ఫనల్ భీమా యోజన పంటల బీమా పథం గురించి రైతులకు అవగాహన కల్పించడాన్నికి వ్యవసాయ శాఖ, బజాజ్ అలియన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బైక్  ర్యాలీని  వ్యవసాయశాఖా జాయింట్ డైరెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా  అయన  మీడియాతో మాట్లాడుతూ జిల్లా రబీ పంటలకు ప్రతి ఒక్క రైతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రతికూల వాతావరణం
వల్ల పంటలకు నష్టము జరిగినప్పుడు తిరిగి రైతులు పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లా అన్ని గ్రామాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల భీమా పథకముపై రైతులకు అవగాహన  కల్నించడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా లో శనగలు, మినుములు,  మిర్చి, పెసర, వేరుశనగ, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలకు బీమా వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ.డి.లు.కొండారెడ్డి, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.
Tags:Rally on Fasal Insurance Scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *