క్షయ వ్యాధి నివరాణపై ర్యాలీ

Rally on tuberculosis

Date:24/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు మందులు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి నయం ఖాయం అన్నారు. జబ్బు లక్షణాలు తెలుపుతూ వైద్య సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలతో కలసి పుర వీధులలో కరపత్రాలు పంపిణీ చేసి, ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హరినాథ్‌రెడ్డి, నాగరాజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి రికార్డు…!

Tags: Rally on tuberculosis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *