Rally to solve the problems of Anganwadi workers

అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

Date:23/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు బుధవారం ర్యాలీ నిర్వహించారు. సంఘ ్యధ్యక్షురాలు లక్ష్మీ, కార్యదర్శి పద్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, పద్మా మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అలాగే కోవిడ్‌ కారణంగా చనిపోయిన అంగన్‌వాడీ సిబ్బందికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండు చేశారు. కనీస వేతనం రూ.21 వేలకు పెంచి, అమలు చేయాలన్నారు. అర్హులైన హెల్పర్లకు, వర్కర్లకు ప్రమోషన్‌ కల్పించాలని డిమాండు చేశారు. ఈ సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

  మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు 

Tags: Rally to solve the problems of Anganwadi workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *