తిరుమలలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma is the director of Thirumala

Ram Gopal Varma is the director of Thirumala

Date:19/10/2018
తిరుమల ముచ్చట్లు:
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిరుపతి పర్యటన ఆసక్తి కరంగా మారింది. మొదట తిరుమల శ్రీవారిని దర్శించు కున్న ఆయన అనంతరం తిరుపతిలో తన తాజా మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా వర్మను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా కు సంబంధించి అనుమానాల నివృత్తికోసమే ఆర్జీవీని కలిశానన్నారు లక్షీపార్వతి. మొత్తం మీద కొంతకాలం సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ చేస్తున్న హడావుడీ ఆసక్తి రేపుతోంది. ఈమధ్య కాలంలో వస్తున్న వరుస ఫ్లాప్ లతో వర్మకు దర్శకుడిగా డిమాండ్ తగ్గినా కాంట్రవర్సీ పర్శన్ గా  మాత్రం ఆయన డిమాండ్ అలాగే ఉంది.
సినిమాల్లో నేకాకుండా షోషల్ మీడియాలో నూ తన ట్వీట్లద్వారా ఫైట్లు చేసే ఆర్జీవీకి ఏం  మాట్లాడినా బోలెడంత మీడియా ప్రచారం వచ్చేస్తుంది.తాజాగా  లక్షీస్ ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్ కోసం  తిరుపతి వెళ్లిన ఆయన మళ్లీ మీడియా అట్రాక్షన్ తన వైపుకుతిప్పుకున్నారు. పైగా నాస్తికుడినని తనకు తానే చెప్పుకున్న ఆయన తిరుమలేశున్ని దర్శనించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. తిరుమల ఆలయం ప్రధాన అంశంగా గతంలో గోవిందా..గోవిందా మూవీ తీసిన ఆయన  చాన్నాళ్ల తర్వాత తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకున్నారు.
అయితే ఎన్టీఆర్ కు శ్రీవారంటేభక్తి కనుకనే ఆయన పై సినిమా తీస్తున్న సందర్భంగా  స్వామివారి దర్శనార్ధం  వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ జీవితంపై తాను సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన జీవితంలో కొన్ని భావోద్వేగమైన ఘట్టాలు ఉండటమే. వాటిలో అత్యంత ప్రధానమైనది ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత సంభవించిన అత్యంత విపత్కరమైన పరిణామాలు. అందుకే ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టామని అన్నారు.
Tags:Ram Gopal Varma is the director of Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *