ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సేవలకు రామ్ రామ్

Ram Ram for food delivery company swiggy services

Ram Ram for food delivery company swiggy services

Date:11/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సేవలను ఇక వినియోగించుకుకునేది లేదని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నేటి (జనవరి 11) నుంచి స్విగ్గీ సర్వీసులకు స్వస్తి పలికారు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ నుంచి 22 శాతం కమిషన్‌ను స్విగ్గీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ తమ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ జొమాటో, ఉబర్ ఈట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చునని ప్రకటించింది. వ్యాపారం నడవడం సంగతి పక్కనపెడితే భారీగా కమిషన్ డిమాండ్ చేస్తే తమకు లాభం లేదని భావించారు. కమిషన్ మరీ ఎక్కువ అడుగుతున్నారు పునరాలోచించాలని సూచించగా స్విగ్గీ అందుకు ఒప్పుకోలేదు. జొమాటో మాత్రం ఆలోచించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పడంతో వీరి కాంట్రాక్ట్ పునరుద్ధరించనున్నారు. ఓవైపు వినియోగదారుల ఫోన్ నెంబర్ వివరాలను దుర్వినియోగం చేస్తూ, మరోవైపు అధికంగా కమీషన్లు ఆశించడం మంచిది కాదని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర సోమానీ సూచించారు. మంత్రి సౌరభ్ పటేల్ సమక్షంలోనే ఫుడ్ డెలివరీ సంస్థలతో అధికారికంగా చర్చలు జరిగాయి. మీటింగ్ అనంతరం గుజరాత్‌లో ఫుడ్ డెలివరీ కోసం జొమాటో, ఉబర్ ఈట్స్‌లను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి స్విగ్గీకి ఆర్డర్ల సర్వీసును నిలిపివేస్తున్నారు.
Tags:Ram Ram for food delivery company swiggy services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *