Natyam ad

ఎన్నికల బరిలో రామచంద్రులు

– 10 మంది పోటీకి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల బరిలో 10 మంది నిలిచినట్లు ఆయన ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ తరపున డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున చల్లా రామచంద్రారెడ్డి, బిసివై తరపున బోడే రామచంద్ర యాదవ్‌ లు ముగ్గరు రామచంద్రులు కావడం గమనార్హం. కాంగ్రెస్‌ తరపున మురళిమోహన్‌ యాదవ్‌, బహుజన సమాఖ్యపార్టీ తరపున సురేష్‌, ఎస్‌డిపీఐ తరపున కె.అన్వర్‌బాషా, స్వతంత్ర అభ్యర్థులుగా ఎస్‌.జమీర్‌ ,నాగేశ్వరరావు, పి.ఫయాజ్‌, జి.రామయ్యలు బరిలో నిలిచారు.

Tags; Ramachandra in the election ring

Post Midle