`మ‌హాస‌ముద్రం`లో ధ‌నుంజ‌య్‌గా క‌న్న‌డ న‌టుడు రామచంద్ర‌రాజు.

సినిమా ముచ్చట్లు :

 

కన్నడ నటుడు రామచంద్రరాజు కేజీఎఫ్ సినిమాలో మెయిన్ విల‌న్ `గరుడ`గా తన అద్భుతమైన న‌ట‌న‌తో  దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. ప్ర‌స్తుతం యంగ్ హీరోస్ శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న `మ‌హాస‌ముద్రం`లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే  విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ ఫ‌స్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు ధ‌నుంజ‌య్‌గా రామ‌చంద్ర‌రాజు ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. భ‌య‌పెట్టేలా ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. తెలుగులో ఈ చిత్రం రామ‌చంద్ర‌రాజుకి మంచి బ్రేక్ ఇస్తుంద‌ని ఈ పోస్ట‌ర్ చూస్తే అర్ద‌మ‌వుతోంది. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకాబోతుంది. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.తారాగ‌ణంః శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్,జగపతి బాబు, రావు రమేష్, రామ‌చంద్రరాజు

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Ramachandra Raju, the Kannada actor as Dhanunjay in `Mahasamudram ‘.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *