Ramadan prayers

ఇండ్లలో రంజాన్‌ ప్రార్థనలు

– సెల్‌ఫోన్లలో శుభాకాంక్షలు
– ముస్లింలకు కరోనా అడ్డు

Date:25/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పవిత్రమైన రంజాన్‌ పండుగను సోమవారం ముస్లింలు సాంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు నిర్వహించారు. ప్రతియేటా ముస్లింలు ర్యాలీగా వెళ్లి ఈద్గాల వద్ద నమాజ్‌లు నిర్వహించడం చేసేవారు. కానీ కరోనా నిబంధనల మేరకు ముస్లింలు తమ ఇండ్లలో , తమ కోళ్ల ఫారాలు, ఫాంహౌస్‌ల వద్ద ప్రార్థనలు జరుపుకున్నారు. పట్టణంలో ఎక్కడ కానీ ముస్లింల పండుగ సందడి కన్పించలేదు. ఇండ్ల వద్దకు వచ్చిన పేదలకు మాత్రం దుస్తులు, అన్నదానం నిర్వహించారు. కేవలం సెల్‌ఫోన్ల మెసెజ్‌లు, ఫోన్లతో ముస్లింలు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం గమనార్హం.

మే 28 నుండి జూన్ 5 వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

Tags: Ramadan prayers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *