వైభవంగా రామాలయ వార్షికోత్సవ వేడుకలు

-వేణుగోపాల చార్య కౌశిక ఆధ్వర్యంలో
-వైధికక్రతువుల నిర్వహణ

జగిత్యాల ముచ్చట్లు:

 

జిల్లా కేంద్రంలోని విద్యానగర్  శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ  తృతీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వాస్తుపండితులు నంబి వేణుగోపాలా చార్య కౌశిక ఆధ్వర్యంలో ఆలయంలో వైధిక క్రతువులు  నిర్వహించారు.ఈ సందర్భంగా మూలవిరాట్టుకు ఫల పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు.తిరుమంజల సేవ, మూలమంత్రముతో హవనము జరిపారు. ఈ కార్యక్రమంలో  ఆలయ ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య, ఆలయ కమిటీ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి,మరియు ధర్మకర్తలు,  ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు  తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Ramalaya Anniversary Celebrations in Glory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *